భీమన్న హుండీ ఆదాయం .. 18 రోజుల్లో రూ. 93 లక్షలు

భీమన్న హుండీ ఆదాయం .. 18 రోజుల్లో రూ. 93 లక్షలు

వేములవాడ,వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయానికి రూ.93 లక్షల హుండీ ఆదాయం వచ్చింది.18 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం ఆలయ ఈవో రమాదేవి, కరీంనగర్  ఏసీ రాజమౌళి పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. రూ.93,52,748 నగదు, 60.100 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు ఈవో తెలిపారు. ఏఈవోలు, పర్యవేక్షకులు, ఆలయ, పోలీస్  సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.